Puthalapattu: పూతలపట్టు ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన గంగారపు గోపి!
Puthalapattu: చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎంపీపీగా గురువారం గంగారపు గోపి ప్రమాణ స్వీకారం చేయగా, ఉపాధ్యక్షులుగా దొరబాబు చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Puthalapattu: పూతలపట్టు ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన గంగారపు గోపి!
Puthalapattu: మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నుకునేందుకు గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీటీసీ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ ఎంపికలో ఎంపీపీగా గంగారపు గోపికి అత్యధిక మెజార్టీ రావడంతో మండల పరిషత్ పదవి బాధ్యతలు చేపట్టారు. మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా దొరబాబు చౌదరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాలు మేరకు చిత్తూరు జిల్లా ఎంపీ దుగ్గి మల్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ జిల్లా నాయకులు యువరాజు నాయుడు, పూతలపట్టు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ దొరబాబు చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.
పూతలపట్టు మండలంలోని అన్ని గ్రామాలను పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మండల అభివృద్ధి కార్యాలయము నందు ఎంపీపీ ఆఫీసుకు ఎవరైనా వచ్చి గ్రామాలలో అభివృద్ధి సమస్యలు ఉన్నాయని చెప్పిన వెంటనే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీపీ పదవి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. పార్టీలు కతీతంగా పూతలపట్టు మండలమును అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు.