Home Loan: రూ. 60 లక్షల హోంలోన్.. ఇలా ఈజీగా 10 ఏళ్లలో తీర్చేయొచ్చు..

Home Loan: సొంతిల్లు కొనుగోలు చేయాలనేది మనందరి కల. కానీ ఆ కలను నిజం చేసే హోమ్ లోన్, పాతికేళ్ల పాటు పీడకలలా మారకూడదంటే.

Update: 2026-05-28 06:20 GMT

Home Loan: రూ. 60 లక్షల హోంలోన్.. ఇలా ఈజీగా 10 ఏళ్లలో తీర్చేయొచ్చు..

Home Loan: సొంతిల్లు.. ప్రతి సామాన్యుడి జీవితంలో ఇదొక అతి పెద్ద కల. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో పాటు, బ్యాంకులో హోమ్ లోన్ కూడా తీసుకుంటాం. లోన్ దొరికిన సంతోషంలో ఎంతో సంబరంగా ఇంటికి గృహప్రవేశం చేస్తాం సరే.. కానీ ఆ తర్వాత నెలానెలా ఈఎంఐ కట్టాలంటే మాత్రం ప్రతి నెలా తలకు మించిన భారమే. దాదాపు 20 లేదా 25 ఏళ్ల పాటు ఈ లోన్ బరువును నెత్తిమీద మోస్తూ, నిద్రలేని రాత్రులు గడిపేవాళ్లు ఎంతోమంది. అయితే ఈ పాతికేళ్ల లోన్‌ని కేవలం 10 నుంచి 15 ఏళ్లలోపే ఎలా పూర్తిగా తీర్చేయాలో ఎప్పుడైనా ఆలోచించారా? అవునండి, ఇది నిజంగా సాధ్యమే!

నిజానికి మనం బ్యాంకు నుంచి తీసుకునే హోమ్ లోన్ మీద అసలు కంటే వడ్డీనే దాదాపు రెట్టింపు కడుతుంటాం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.. మీరు రూ. 60 లక్షల లోన్ 25 ఏళ్ల కాలపరిమితికి తీసుకున్నారనుకోండి. దానికి మీరు కట్టే వడ్డీయే దాదాపు రూ. 90 లక్షలకు పైగా ఉంటుంది. వినడానికే చాలా షాకింగ్‌గా ఉంది కదూ! మరి ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి నిపుణులు చెబుతున్న ఒక అద్భుతమైన మాస్టర్ చిట్కా ఏంటంటే.. 'ఎక్స్‌ట్రా ఈఎంఐ చెల్లింపు, వార్షిక ఇంక్రిమెంట్ పద్ధతి'.

మనం ప్రతి నెలా ఈఎంఐ కట్టడం ఎలాగూ తప్పనిసరి. కానీ, ఏడాదంతా కట్టే 12 ఈఎంఐలతో పాటు, ప్రతి సంవత్సరం బోనస్ లేదా సేవింగ్స్ వాడుకుని ఒక అదనపు ఈఎంఐ (అంటే 13వ ఈఎంఐ) కట్టడం కచ్చితంగా అలవాటు చేసుకోండి. ఈ చిన్న మార్పు వల్ల మీ లోన్ టెన్యూర్ ఏకంగా 5 ఏళ్లు ముందుగానే తగ్గిపోతుంది. దీనికి తోడుగా, ప్రతి సంవత్సరం మీ జీతం పెరిగినప్పుడు లేదా ఏదైనా అదనపు ఆదాయం వచ్చినప్పుడు, మీ ఈఎంఐని కూడా కనీసం 5 శాతం నుంచి 10 శాతం వరకు క్రమంగా పెంచుకుంటూ వెళ్లండి. ఇలా చేస్తే మీ 25 ఏళ్ల పెద్ద హోమ్ లోన్ కేవలం 10 నుంచి 15 ఏళ్లలోపే కళ్లముందే పూర్తయిపోతుంది.

ఇలా ముందస్తుగా చెల్లించే అసలు వల్ల భవిష్యత్తులో పడే వడ్డీ భారం భారీగా తగ్గిపోతుంది. తద్వారా మీరు కష్టపడి సంపాదించిన దాదాపు రూ. 30 నుంచి రూ. 40 లక్షల సొమ్మును ఆదా చేసుకోవచ్చు.

నిజానికి లోన్ అనేది జీవితకాలం మోసే శిక్ష ఎంతమాత్రం కాదు. కొంచెం పక్కా ప్లానింగ్, కాస్త ఆర్థిక క్రమశిక్షణ ఉంటే హోమ్ లోన్‌ను సులభంగా పూర్తి చేయవచ్చు. మనం కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకులకు వడ్డీల రూపంలో సమర్పించుకోకుండా, మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుందాం.

Tags:    

Similar News