VIDA VX2 Plus : 187KM రేంజ్‌తో హీరో నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.!

VIDA VX2 Plus : ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ బ్రాండ్ 'విడా' (VIDA) భారత మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను..

Update: 2026-07-12 08:31 GMT

VIDA-VX2-Plus

VIDA VX2 Plus : ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ బ్రాండ్ 'విడా' (VIDA) భారత మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఎక్కువ దూరం ప్రయాణించే వారిని టార్గెట్ చేస్తూ 'VIDA VX2 Plus 4.4 kWh' మోడల్‌ను కంపెనీ పరిచయం చేసింది. అదిరిపోయే రేంజ్, రిమూవబుల్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తున్న ఈ స్కూటర్, లాంచ్‌కు ముందే ఏకంగా 12,111 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి 'ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్' (Asia Book of Records) లో చోటు దక్కించుకోవడం విశేషం.

ఒక్క ఛార్జ్‌తో 187 కిలోమీటర్ల రేంజ్

కొత్త VIDA VX2 Plus స్కూటర్‌లో పవర్‌ఫుల్ 4.4 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. 2.2 kWh సామర్థ్యం గల రెండు రిమూవబుల్ బ్యాటరీలు ఉంటాయి. అంటే వీటిని స్కూటర్ నుండి ఈజీగా బయటకు తీసి ఇంట్లో గానీ, ఆఫీస్‌లో గానీ నార్మల్ ప్లగ్ పాయింట్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ లెక్కల ప్రకారం, ఈ స్కూటర్ పూర్తి ఛార్జింగ్‌పై IDC ప్రమాణాల ప్రకారం ఏకంగా 187 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ ఇస్తుంది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు, లాంగ్ రైడ్స్ వెళ్లేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

కేవలం 65 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్

ఛార్జింగ్ స్పీడ్ విషయంలో కూడా ఈ స్కూటర్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఇంట్లో వాడే 1kW పోర్టబుల్ ఛార్జర్ ద్వారా ఈ స్కూటర్ బ్యాటరీ 0 నుండి 80 శాతం ఛార్జ్ కావడానికి సుమారు 3 గంటల 30 నిమిషాల టైమ్ పడుతుంది. అదే మీరు బయట ఉండే DC ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే.. కేవలం 65 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. అర్జెంట్‌గా బయటకు వెళ్లాలనుకునే వారికి ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఎంతో హెల్ప్ అవుతుంది.

దేశవ్యాప్తంగా భారీ ఛార్జింగ్ నెట్‌వర్క్

ఈ స్కూటర్ కొనే కస్టమర్లకు ఛార్జింగ్ టెన్షన్ లేకుండా హీరో మోటోకార్ప్ గట్టి ప్లాన్ చేసింది. దేశవ్యాప్తంగా 6,000 కంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను, 700 పైగా సర్వీస్ టచ్‌పాయింట్లను అందుబాటులో ఉంచింది. దీనితో పాటు 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్' (BaaS) ప్లాన్లను కూడా ఆఫర్ చేస్తోంది. దీనివల్ల కస్టమర్లు బ్యాటరీ ఖర్చును చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు.

ధర , లభ్యత ఎప్పటి నుంచి.?

Hero VIDA VX2 Plus 4.4 kWh ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.1,43,990 (ఢిల్లీ) గా నిర్ణయించారు. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ నెల చివరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విడా (VIDA) డీలర్‌షిప్‌లలో కస్టమర్లకు కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానుంది. మంచి రేంజ్, నమ్మకమైన బ్రాండ్ వాల్యూ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న వారికి ఈ కొత్త విడా మోడల్ ఒక మంచి ఛాయిస్ కానుంది.

Tags:    

Similar News