Car Resale Value : మీ పాత కారుకు అదిరిపోయే ధర రావాలా.? రీసేల్ వాల్యూ పెంచే సూపర్ టిప్స్ ఇవే.!

Car Resale Value : ఈ రోజుల్లో కొత్త కారు కొనడం ఎంత ఈజీ అయిపోయిందో, పాత కారును మంచి రేటుకు అమ్మడం అంత కష్టంగా మారింది. చాలా మంది తమ కారును

Update: 2026-05-10 09:30 GMT

car-resale-value

Car Resale Value : ఈ రోజుల్లో కొత్త కారు కొనడం ఎంత ఈజీ అయిపోయిందో, పాత కారును మంచి రేటుకు అమ్మడం అంత కష్టంగా మారింది. చాలా మంది తమ కారును ఎంతో ప్రాణంగా చూసుకున్నప్పటికీ, అమ్మేటప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవడం వల్ల ఆశించిన ధరను పొందలేకపోతున్నారు. అయితే కొన్ని స్మార్ట్ పద్ధతులు పాటిస్తే మీ పాత కారు రీసేల్ వాల్యూను ఈజీగా పెంచుకోవచ్చు. దీనివల్ల కొనేవారికి మీ కారుపై నమ్మకం కలగడమే కాకుండా, మార్కెట్ ధర కంటే మెరుగైన అమౌంట్ పొందే అవకాశం ఉంటుంది.

సర్వీసింగ్ విషయంలో అస్సలు తగ్గకండి

కారు ఇంజిన్ కండిషన్ బాగుంటేనే దానికి మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే రెగ్యులర్ గా సర్వీసింగ్ చేయించడం చాలా ముఖ్యం. సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చడం, బ్రేక్స్ చెక్ చేయించడం, టైర్ రొటేషన్ వంటి పనులు కారు పెర్ఫార్మెన్స్ ను కాపాడతాయి. ఏదైనా మెకానికల్ ఇష్యూ ఉంటే వెంటనే రిపేర్ చేయించాలి. కొనే వ్యక్తి కారును టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు ఇంజిన్ స్మూత్ గా ఉంటే, వారు మీరు అడిగిన రేటు ఇవ్వడానికి వెనుకాడరు. అందుకే అమ్మకానికి పెట్టే ముందు ఒకసారి ప్రొఫెషనల్ మెకానిక్ తో కారును పూర్తిగా చెక్ చేయించడం మంచిది.

ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ముఖ్యం

కారు చూడగానే నీట్ గా ఉంటేనే ఎవరికైనా కొనాలనే ఆసక్తి కలుగుతుంది. అందుకే కారు లోపల, బయట క్లీన్ గా ఉంచుకోవాలి. సీట్లు శుభ్రంగా ఉండటం, క్యాబిన్ నుండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా చూసుకోవడం కారును మరింత ప్రీమియంగా మారుస్తాయి. వీలైతే ఒకసారి ప్రొఫెషనల్ క్లీనింగ్ , పాలిషింగ్ చేయిస్తే కారు కొత్త దానిలా మెరుస్తుంది. డాష్‌బోర్డ్ మెరుస్తూ, సీట్ కవర్లు టైట్ గా ఉంటే కొనేవారు కారును కేర్ ఫుల్ గా వాడారని భావిస్తారు. ఇది కారు వాల్యూను ఒక్కసారిగా పెంచేస్తుంది.

రికార్డులే మీ కారుకు సర్టిఫికెట్లు

కారు మెయింటెనెన్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు చాలా కీలకం. సర్వీస్ హిస్టరీ, రిపేర్ బిల్లులు, ఇన్సూరెన్స్ పేపర్లు అన్నీ ఒక ఫైల్ లాగా భద్రంగా ఉంచుకోవాలి. కారును ఏ షోరూమ్ లో సర్వీస్ చేయించారు, ఎప్పుడెప్పుడు ఏ పార్ట్స్ మార్చారు అనే పూర్తి వివరాలు ఉంటే కొనేవారికి కారుపై పూర్తి భరోసా కలుగుతుంది. ఎలాంటి డాక్యుమెంట్స్ లేని కారు కంటే, పూర్తి హిస్టరీ ఉన్న కారుకు మార్కెట్ లో ఎక్కువ రేటు పలుకుతుంది. ఎందుకంటే ఆ కారులో ఎలాంటి పెద్ద టెక్నికల్ ఇష్యూస్ లేవని ఈ పేపర్లు నిరూపిస్తాయి.

చిన్న చిన్న రిపేర్లను వదిలేయకండి

చాలా మంది వైపర్లు సరిగ్గా పని చేయకపోయినా, చిన్న చిన్న లైట్లు వెలగకపోయినా, తలుపులు తీసేటప్పుడు సౌండ్ వచ్చినా పట్టించుకోరు. కానీ ఇవి కొనేవారి మైండ్ లో నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. తక్కువ ఖర్చుతో అయిపోయే ఇలాంటి చిన్న పనులను వెంటనే పూర్తి చేయాలి. అలాగే కారులో టచ్ స్క్రీన్ సిస్టమ్, రివర్స్ కెమెరా, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉంటే కారు డిమాండ్ పెరుగుతుంది. అయితే అవసరానికి మించి మాడిఫికేషన్లు చేయడం వల్ల ఒక్కోసారి వాల్యూ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. కారును పండగ సీజన్లలో అమ్మడం వల్ల లేదా 3 నుండి 5 ఏళ్ల మధ్యలో అమ్మడం వల్ల బెస్ట్ ప్రైస్ వచ్చే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News