Tata EV: టాటా ఈవీలపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.3.35 లక్షల డిస్కౌంట్లు!

Tata EV: "టాటా మోటార్స్ తమ ఎలక్ట్రిక్ కార్లపై జులై నెల బంపర్ ఆఫర్లను ప్రకటించింది.

Update: 2026-07-05 04:00 GMT

Tata EV: టాటా ఈవీలపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.3.35 లక్షల డిస్కౌంట్లు!

Tata electric car offers: ప్రస్తుత రోజుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతుండడంతో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ కార్లు, బైకులు ఇప్పుడు ఇండియన్ రోడ్లపై హల్చల్ చేస్తున్నాయి. సరిగ్గా ఇదే క్రమంలో.. మార్కెట్‌ పరిస్థితులను అందిపుచ్చుకుని సేల్స్ పెంచుకునేందుకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ కస్టమర్ల ముందుకు ఒక అదిరిపోయే బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది.

ఈ జులై నెలలో కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి టాటా మోటార్స్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తమ ఈవీ పోర్ట్‌ఫోలియోపై ఈ నెలలో గరిష్ఠంగా రూ.3.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఇందులో క్యాష్ బెనిఫిట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ వంటి ప్రయోజనాలు కలిసి ఉన్నాయి. ముఖ్యంగా టాటా కర్వ్ ఈవీపై అత్యధిక ప్రయోజనాలు లభిస్తున్నాయి. మరి టాటా మోటార్స్‌కు చెందిన ఏ ఏ ఈవీ కార్లపై ఎంతెంత డిస్కౌంట్ వస్తుందో క్లియర్ కట్‌గా ఇప్పుడు చూద్దాం.

టాటా కర్వ్ ఈవీ

టాటా కర్వ్ విద్యుత్తు కార్లపై కస్టమర్లు గరిష్ఠంగా రూ.3.35 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. మే నెల అప్‌డేట్‌కు ముందు వచ్చిన 'ఎక్స్ సిరీస్' వేరియంట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో కేవలం క్యాష్ డిస్కౌంటే రూ.3 లక్షల వరకు ఉండడం విశేషం.

టాటా హారియర్ ఈవీ

టాటా హారియర్ ఎలక్ట్రిక్ కారుపై రూ.2.75 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఈ మోడల్‌పై నేరుగా క్యాష్ డిస్కౌంట్ లేదు. కానీ, రూ.1 లక్ష వరకు ఇంటర్వెన్షన్ , లాయల్టీ బోనస్‌లు, అలాగే రూ.75 వేల వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ లభిస్తుంది.

టాటా పంచ్ ఈవీ

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతోన్న విద్యుత్తు కార్లలో టాటా పంచ్ ఒకటి. దీని లాంగ్ రేంజ్ వేరియంట్లపై గరిష్ఠంగా రూ.1.45 లక్షల వరకు, అలాగే మీడియం రేంజ్ వేరియంట్లపై రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు అందుతాయి.

టాటా టియాగో ఈవీ

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన 'ప్రీ ఫేస్ లిఫ్ట్' మోడల్ పై రూ.1.45 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో సాధారణ ఎంఆర్ వేరియంట్లపై రూ.65 వేల వరకు, ఎల్‌ఆర్ వేరియంట్లపై రూ.1 లక్ష వరకు ఆఫర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఈవీ

టాటా మోటార్స్ ఇండ్లియాలో మోస్ట్ పాపులర్ ఎలక్ట్రిక్ కార్లలో నెక్సాన్ ఒకటి. ఈ కార్లపై రూ.50 వేల వరకు తగ్గింపు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో రూ.15 వేల క్యాష్ బ్యాక్ , రూ.35 వేల వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ లభిస్తుంది. నెక్సాన్ అన్ని వేరియంట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఈ ఆఫర్లు అనేవి మీరు ఉండే ప్రాంతాన్ని బట్టి, కార్ల వేరియంట్లు మరియు డీలర్లను బట్టి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త కారు బుక్ చేసుకునే ముందు మీ సమీపంలోని అధీకృత టాటా మోటార్స్ షోరూమ్‌కు వెళ్లి ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు కనుక్కోవడం మంచిది.

Tags:    

Similar News