మధ్యతరగతికి గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో వచ్చిన రెనో క్విడ్.. ధర వింటే ఇప్పుడే కొనేస్తారు!
New Renault Kwid: భారతీయ రోడ్లపై మధ్యతరగతి ప్రజల మన్ననలు పొందిన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో రెనో క్విడ్ ఎప్పుడూ ముందుంటుంది.
మధ్యతరగతికి గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో వచ్చిన రెనో క్విడ్.. ధర వింటే ఇప్పుడే కొనేస్తారు!
New Renault Kwid 2026 Launch: సొంతంగా ఒక అందమైన, బడ్జెట్ కారును కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న సగటు భారతీయుడి కలలను నిజం చేస్తూ ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ సంస్థ రెనో (Renault), మార్కెట్లోకి సరికొత్త 2026 క్విడ్ (Kwid) మోడల్‌ను అద్భుతమైన మార్పులతో విడుదల చేసింది. కేవలం రూ. 4.53 లక్షల ఆకర్షణీయమైన ప్రారంభ ధరతో ఈ సరికొత్త కారు అందుబాటులోకి వచ్చింది.
భారతీయ రోడ్లపై మధ్యతరగతి ప్రజల మన్ననలు పొందిన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో రెనో క్విడ్ ఎప్పుడూ ముందుంటుంది. కస్టమర్ల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా, సరికొత్త మోడ్రన్ అప్‌డేట్లతో 2026 వెర్షన్ క్విడ్ కారును కంపెనీ దేశీయ మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ కొత్త తరం మోడల్‌లో రెనో సంస్థ తన తాజా బ్రాండ్ ఐడెంటిటీని పరిచయం చేయడమే కాకుండా, కస్టమర్లు సులభంగా ఎంపిక చేసుకునేలా వేరియంట్ల జాబితాను మరింత సరళతరం చేసింది. గతంలో ఉన్న అనేక కన్ఫ్యూజింగ్ వేరియంట్లకు బదులుగా ఇప్పుడు కేవలం ఎవల్యూషన్ (Evolution), క్లైంబర్ (Climber) అనే రెండు ప్రధాన వేరియంట్లలో మాత్రమే ఈ కారును అందిస్తోంది.
ఆకర్షణీయమైన ధరలు.. ఏ వేరియంట్ ఎంతంటే?
కొత్త రెనో క్విడ్ బేస్ మోడల్ అయిన 'ఎవల్యూషన్' మాన్యువల్ ధరను ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 4,52,900 గా నిర్ణయించారు. ఇదే వేరియంట్ ఆటోమేటిక్ (AMT) ధర రూ. 4,89,900 గా ఉంది. ఇక కాస్త లగ్జరీ లుక్, ఫీచర్లు ఉండే టాప్-ఎండ్ 'క్లైంబర్' మాన్యువల్ వేరియంట్ ధర రూ. 5,14,900 కాగా, దాని ఆటోమేటిక్ వెర్షన్ ధరను రూ. 5,60,900 గా నిర్ణయించారు. అయితే, కంపెనీ డిజిటల్ కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎవరైనా కస్టమర్ అధికారిక రెనో వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ కారును బుక్ చేసుకుంటే, క్లైంబర్ వేరియంట్‌పై అదనంగా రూ. 15,000 ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి.
లుక్ మారింది.. స్టైల్ పెరిగింది!
ఈ సరికొత్త మోడల్‌లో బాహ్య డిజైన్ పరంగా పాత కారు పోలికలు ఉన్నప్పటికీ, దీనికి మరింత తాజా రూపాన్ని ఇచ్చేందుకు కొన్ని ఆకర్షణీయమైన మార్పులు చేశారు. కారు ముందు భాగంలో, వెనుక టెయిల్‌గేట్‌పై సరికొత్త త్రీడీ (3D) రెనాల్ట్ లోగోను అమర్చారు. అలాగే కొత్త డిజైన్‌తో కూడిన డ్యూయల్-టోన్ వీల్ కవర్లు, తెలుపు రంగు ఇన్‌సర్ట్‌లతో కూడిన రూఫ్ రైల్స్ ఈ కారుకు అచ్చమైన మినీ ఎస్‌యూవీ లుక్‌ను తీసుకొచ్చాయి. క్యాబిన్ లోపల కూడా డ్రైవింగ్ అనుభూతిని మార్చేందుకు, రెనో తన ప్రీమియం మోడల్ కైగర్ నుంచి సేకరించిన సరికొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను ఇందులో అందించింది.
అదిరిపోయే ఫీచర్లు, తిరుగులేని భద్రత..
మధ్యతరగతి బడ్జెట్ కారు అయినప్పటికీ, ఇందులో లగ్జరీ ఫీచర్లకు కొరత లేదు. ఈ కొత్త క్విడ్‌లో 8-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నాలుగు పవర్ విండోలను అమర్చారు. ఇండియన్ రోడ్లపై సులభంగా ప్రయాణించేందుకు వీలుగా 184 మిల్లీమీటర్ల అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్, 279 లీటర్ల బూట్ స్పేస్‌ను అందించారు. ఇక భద్రత విషయానికి వస్తే, ఇందులో 17 రకాల ప్రాండభిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. బేస్ వేరియంట్‌లో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు లభిస్తుండగా, టాప్ ఎండ్ క్లైంబర్ వేరియంట్‌లో ప్రయాణికుల పూర్తి రక్షణ కోసం ఏకంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చడం విశేషం.
మైలేజ్ కోసం సిఎన్‌జి ఆప్షన్ కూడా..
ఈ కారులో నమ్మకమైన 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 69 హార్స్‌పవర్, 92.5 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. ఆటోమేటిక్ వేరియంట్లలో ప్రీమియం లుక్ ఇచ్చే రోటరీ డయల్ గేర్ సెలెక్టర్‌ను అందించారు. మైలేజ్ ఎక్కువ కోరుకునే వారి కోసం, డీలర్ ద్వారా అమర్చే సరికొత్త సిఎన్‌జి (CNG) కిట్ సౌకర్యాన్ని కూడా రెనో అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం అదనంగా రూ. 70,450 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సిఎన్‌జి కిట్‌పై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీని కూడా ఇస్తోంది.
తక్కువ ధరలో సొంత కారు కల నెరవేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ 2026 రెనో క్విడ్ ఒక సరైన ప్యాకేజీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌ల భద్రత, మోడ్రన్ ఫీచర్లు, ఎస్‌యూవీ లాంటి స్టైలిష్ లుక్ లభిస్తుండటంతో ఈ కారు రాబోయే రోజుల్లో మార్కెట్లో మంచి అమ్మకాలను నమోదు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.