Mahindra: మహీంద్రా సంచలన నిర్ణయం.. స్కార్పియో, థార్ కార్లపై మైండ్ బ్లాక్ అయ్యే డిస్కౌంట్స్

Mahindra: దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తమ పాపులర్ పెట్రోల్, డీజిల్ ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్లు, బెనిఫిట్స్‌ను ప్రకటించింది.

Update: 2026-08-12 13:57 GMT

Mahindra: మహీంద్రా సంచలన నిర్ణయం.. స్కార్పియో, థార్ కార్లపై మైండ్ బ్లాక్ అయ్యే డిస్కౌంట్స్

Mahindra: దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తమ పాపులర్ పెట్రోల్, డీజిల్ ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్లు, బెనిఫిట్స్‌ను ప్రకటించింది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన అవకాశం. ఈ ఆఫర్లు ఆగస్టు 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా స్కార్పియో N, థార్ రాక్స్ మోడళ్లపై అత్యధికంగా బెనిఫిట్స్ లభిస్తున్నాయి.

1. మహీంద్రా స్కార్పియో N..

మహీంద్రా తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్కార్పియో N పై గరిష్టంగా రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.లక్ష క్యాష్ డిస్కౌంట్ రూపంలో, మరొక రూ.25,000 విలువైన ఫ్రీ యాక్సెసరీస్ రూపంలో లభిస్తాయి. ఈ ఆఫర్ డీలర్ల వద్ద అందుబాటులో ఉన్న పాత ప్రీ-ఫేస్‌లిఫ్ట్ స్టాక్‌పై వర్తిస్తుంది. భారత మార్కెట్లో స్కార్పియో N ఎక్స్-షోరూమ్ ధర రూ.13.69 లక్షల నుంచి రూ.25.49 లక్షల వరకు ఉంది. ఇది పవర్‌ఫుల్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు, అద్భుతమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలకు పేరుగాంచింది.

2. మహీంద్రా థార్ రాక్స్..

ఇటీవలే మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న 5-డోర్ మహీంద్రా థార్ రాక్స్‌పై మొత్తం రూ.1.20 లక్షల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ.92,000 క్యాష్ డిస్కౌంట్‌తో పాటు రూ.28,000 విలువైన ఉచిత సెరామిక్ కోటింగ్ ప్యాకేజీని కంపెనీ అందిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.12.52 లక్షల నుంచి రూ.23.52 లక్షల వరకు ఉంది. సాధారణ 3-డోర్ థార్‌తో పోలిస్తే ఇది మరింత ప్రాక్టికల్ కేబిన్, అధునాతన రైడింగ్ కంఫర్ట్‌ను అందిస్తుంది.

3. మహీంద్రా స్కార్పియో క్లాసిక్, థార్ 3-డోర్..

పాపులర్ స్కార్పియో క్లాసిక్ మోడల్‌పై రూ.75,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో రూ.50,000 నేరుగా క్యాష్ డిస్కౌంట్ కాగా, రూ.25,000 విలువైన యాక్సెసరీస్ పొందవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.13.37 లక్షల నుంచి రూ.17.40 లక్షల వరకు ఉంది. అలాగే క్రేజీ ఆఫ్-రోడర్ అయిన 3-డోర్ మహీంద్రా థార్‌పై రూ.50,000 వరకు క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. దీని ధర మార్కెట్లో రూ.10.32 లక్షల నుండి రూ.18 లక్షల మధ్య ఉంది.

4. బొలేరో నియో, నియో ప్లస్, XUV 3XO..

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మంచి ఆదరణ ఉన్న బొలేరో నియో, బొలేరో నియో ప్లస్ ఎస్‌యూవీలపై రూ.45,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. ఇవి రెండూ తమ రఫ్ అండ్ టఫ్ బాడీకి, కఠినమైన రోడ్లపై సులభంగా ప్రయాణించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. ఇకపోతే కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ట్రెండింగ్‌లో ఉన్న మహీంద్రా XUV 3XO పై రూ.40,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.79 లక్షల నుంచి రూ.15.04 లక్షల వరకు ఉంది.

Tags:    

Similar News