Vastu Tips: ఇంటికి గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలి.? ఏ రోజు కడితే మంచిది.. ఏది చెడ్డది.!
Vastu Tips: "నర ఘోషకు నల్లరాయి కూడా పగులుతుంది" అంటారు. మన ఇళ్లకు, వ్యాపార సంస్థలకు ఇతరుల దిష్టి తగలకుండా గుమ్మడికాయను ఎప్పుడు కట్టాలి.
Vastu Tips: ఇంటికి గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలి.? ఏ రోజు కడితే మంచిది.. ఏది చెడ్డది.!
Vastu Tips: సాధారణంగా మనం కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, లేదా ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టినప్పుడు కానీ ఇతరుల దృష్టి మనపై పడుతుంది. "నర ఘోషకు నల్లరాయి కూడా పగులుతుంది" అని పెద్దలు చెబుతుంటారు. ఎదుటివారి ఏడుపు, అసూయ వల్ల ఇంట్లో తరచుగా గొడవలు రావడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం, వ్యాపారంలో నష్టాలు రావడం లాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి నరదృష్టి, ప్రతికూల శక్తుల నుంచి మన ఇంటిని రక్షించుకోవడానికి మన పూర్వీకులు సూచించిన అద్భుతమైన మార్గం 'బూడిద గుమ్మడికాయ' కట్టడం. మరి ఆ గుమ్మడికాయ ప్రాముఖ్యతను గురించి పలు కీలక విషయాలు తెలుసుకుందాం.
గుమ్మడికాయ ఎందుకు కట్టాలి?
బూడిద గుమ్మడికాయకు ఇంట్లోకి వచ్చే నెగెటివ్ ఎనర్జీని తనలోకి లాక్కుని, పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేసే అద్భుతమైన గుణం ఉంటుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారి మొదటి చూపు నేరుగా ఈ గుమ్మడికాయపైనే పడుతుంది. తద్వారా వారిలో ఉన్న చెడు ఆలోచనలు లేదా అసూయ తీవ్రత అక్కడికక్కడే నశించిపోతుంది.
ఇంటికి గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలి?
గుమ్మడికాయను ఇంటికి కట్టడానికి అత్యంత పవిత్రమైన, అనువైన రోజులు అమావాస్య, పౌర్ణమి. అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో కుదరకపోతే, మంగళవారం లేదా శుక్రవారం ఉదయం పూట కూడా దీనిని కట్టవచ్చు.
ఎలా కట్టాలి? పాత గుమ్మడికాయను ఏం చేయాలి?
ముందుగా బూడిద గుమ్మడికాయను తెచ్చి శుభ్రంగా కడిగి, దానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. కొందరు దీనికి కాటుక లేదా ఎర్రటి వస్త్రం కూడా చుడతారు. పూజా గదిలో దేవుని ముందు ఉంచి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి, ఇంటికి ఎలాంటి దృష్టి దోషం కలగకూడదని ప్రార్థించాలి. అనంతరం, ఇంటి ప్రధాన ద్వారం మధ్యలో, ఇంటికి వచ్చేవారి కంటికి స్పష్టంగా కనిపించేలా ఒక తాడుతో వేలాడదీయాలి.
ఇక పాత గుమ్మడికాయ విషయానికి వస్తే.. ఆ గుమ్మడికాయ పూర్తిగా ఎండిపోయినా, లేదా పాడైపోయి కుళ్లిపోయినా వెంటనే తీసేయాలి. తీసేసిన పాత గుమ్మడికాయను ఎక్కడపడితే అక్కడ పడేయకూడదు. ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వేయాలి. వీలైతే వీధి చివర ఎవరూ లేని సమయంలో దాన్ని పగలగొట్టి రావడం ఉత్తమం.