Daily Horoscope: ద్వాదశ రాశులపై ధృతి, శూలయోగం ప్రభావం... పట్టిందల్లా బంగారమే

గ్రహాస్థితి, నక్షత్రాల మార్పుల ప్రభావం 12 రాశుల వారి దైనందిన జీవితంపై, ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాలపై ఎలా ఉండబోతోందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Update: 2026-05-19 02:07 GMT

Daily Horoscope: అధిక జ్యేష్ట మాస శుక్ల పక్ష తదియ తిథి ప్రభావంతో ఈ రోజు ఆధ్యాత్మికత, ఆలోచన, ఆత్మపరిశీలనకు అనుకూలంగా మారింది. మృగశీర్ష నక్షత్రం నుంచి ఆరుద్ర నక్షత్రంలోకి మారుతున్న ఈ గ్రహచలనాలు కొన్ని రాశుల వారికి శుభప్రద ఫలితాలు అందించగా, మరికొన్ని రాశుల వారు నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధృతి యోగం ప్రభావంతో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంత పురోగతి కనిపిస్తుండగా, శూల యోగం కారణంగా కొందరికి మానసిక ఆందోళనలు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ రోజు ఎవరికెంత అదృష్టం కలిసివస్తుందో తెలుసుకుందాం.

మేషరాశి

మేష రాశి వారికి ఈ రోజు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కష్టపడి పనిచేసిన వారికి ఫలితాలు దక్కే రోజు ఇది. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తే లాభాలు పొందగలరు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చలు జరగవచ్చు. ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయాలి.

వృషభరాశి

వృషభ రాశి వారికి ఈ రోజు కొంత ఓర్పు అవసరం. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉండి ఫలితం తక్కువగా అనిపించవచ్చు. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా ప్రశాంతంగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు ఈరాశివారు దక్షిణామూర్తిని ఆరాధించాలి.

మిథునరాశి

మిథున రాశి వారికి ఈ రోజు శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి కావచ్చు. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ధనలాభం కూడా కలిగే అవకాశముంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు ఈరాశివారు శ్రీమహాలక్ష్మి ఆరాధన చేయాలి.

కర్కాటకరాశి

కర్కాటక రాశి వారు ఈ రోజు భావోద్వేగాలకు లోనవకుండా ఉండాలి. చిన్న చిన్న వివాదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా ఓర్పుతో ముందుకు వెళ్తే సమస్యలు తగ్గుతాయి. దాంపత్య జీవితంలో మాటల జాగ్రత్త అవసరం. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. ఆరోగ్య పరంగా అలసట కనిపిస్తుంది. ఈరోజు ఈరాశివారు పంచముఖ ఆంజనేయుడిని దర్శించుకోవడం శ్రేయస్కరం.

సింహరాశి

సింహ రాశి వారికి ఈ రోజు ఉత్సాహభరితంగా ఉంటుంది. వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు ఈరాశివారు శ్రీ వరాహమూర్తిని దర్శించుకోవడం శుభకరం.

కన్యారాశి

కన్య రాశి వారికి ఈ రోజు అదృష్టం బలంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు లాభాల దిశగా నడుస్తాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఈరాశివారు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం శ్రేయస్కరం.

తులారాశి

తుల రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ఉద్యోగులు తమ ప్రతిభతో గుర్తింపు పొందుతారు. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశముంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయాలి.

వృశ్చికరాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరగవచ్చు. కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి. ఈరోజు ఈరాశివారు కార్యసిద్ది హనుమాన్‌ను దర్శించుకోవాలి.

ధనస్సురాశి

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో కీలక మార్పులు చోటు చేసుకోవచ్చు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈరోజు ఈరాశివారు లక్ష్మీనారాయణులను ఆరాధించాలి.

మకరరాశి

మకర రాశి వారికి ఈ రోజు కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది. ఈ రోజు ఈరాశివారు ఆదిదంపతులను దర్శించుకొని శివపంచాక్షరిని పఠించాలి.

కుంభరాశి

కుంభ రాశి వారికి ఈ రోజు జాగ్రత్త అవసరం. కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కాదు. కుటుంబంలో కలహాలు రాకుండా మాటల్లో నియంత్రణ అవసరం. ఖర్చులు అధికమయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు ఈరాశివారు లక్ష్మీనరసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

మీనరాశి

మీన రాశి వారికి ఈ రోజు సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు ఈరాశివారు దత్తాత్రేయుడిని దర్శించుకొని గురు పాదుకా శ్లోకం పఠించాలి.

గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్య రాశిఫలితాలు మాత్రమే. ఎవరి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇచ్చినవి కావు. 

Tags:    

Similar News