Daily Horoscope: రాశిఫలాలు - ఈ మూడు రాశుల వారికి రాజయోగం...వీరికి పట్టిందల్లా బంగారం
వైశాఖమాసం బహుళ పక్ష దశమి తిథి రోజున ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Daily Horoscope: ఈరోజు దశమి తిథి ప్రభావంతో కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉండగా, మరికొన్ని రాశులకు చెందిన వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యశాస్త్రం సూచిస్తున్నది. అంతేకాదు, ఈరోజు పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం చేత ఆలోచనల్లో స్థిరత్వం, నిర్ణయాల్లో స్పష్టత కూడా అవసరం. తొందపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. గురు, శని, చంద్ర గ్రహాల సంచారం వలన కొన్ని రాశులు ఆర్థికంగా లాభాలను పొందనున్నాయి. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు సాధారణంగా ఉన్నాయి. ఎక్కువ శ్ర చేయవలసి వస్తుంది. అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో వివాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇక ఈరోజు ఈరాశివారు దక్షిణామూర్తిని దర్శించుకోవడం ఉత్తమం.
వృషభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అదృష్టయోగం ఉంది. గతంలో చేపట్టిన పనులు పూర్తవుతాయి. గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా లాభం పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ఈరోజు ఈరాశివారు లక్ష్మీదేవిని ఆరాధించాలి.
మిథునరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. పనుల విషయంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఉద్యోగం మార్పు కోరుకునే వారికి ఇది అనుకూల సమయం. ఆర్థికంగా బలపడేందుకు ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు. ఈరోజు ఈరాశివారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఉత్తమం.
కర్కాటకరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. తొందరపాటుతో చేపట్టిన పనుల వలన ఆటంకాలు ఎదురౌతాయి. బాకీలు వసూలు కష్టమౌతుంది. ఆందోళనలను పెరుగుతాయి. మానసిక ఒత్తిడి కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈరోజు ఈరాశివారు మహాశివుడికి అభిషేకం చేయడం వలన సాయంత్రం వరకు ఆటంకాలు తొలగిపోతాయి.
సింహరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. పనులు నెమ్మదిగా ముందుకు సాగుతాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెద్దల సలహాలు తీసుకోవాలి. వ్యాపారంలో కొంత అనుకూలత ఉంటుంది. శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించాలి.
కన్యారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురౌతాయి. జీవితంలో అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని కొంతమంది తప్పుదోవ పట్టించేందుకు సిద్దంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు ఈరాశివారు శివ పంచాక్షరిని జపించాలి.
తులారాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. అకస్మాత్తుగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆగిపోయిన శుభకార్యాలు తిరిగి ప్రారంభమౌతాయి. ఈరోజు ఈరాశివారు శ్రీమహాలక్ష్మీని ఆరాధించాలి.
వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఈరోజంతా ఉత్సాహంగా ఉంటారు. కెరీర్‌లో మలుపులు ఉండే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి సమయాన్ని గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈరాశివారు కార్యసిద్ధి గణపతిని సందర్శించడం శుభప్రదం.
ధనస్సురాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సమస్యలు పరిష్కారమౌతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటారు. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయాలి.
మకరరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రయాణాల కారణంగా అలసట పెరుగుతుంది. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. మీతో విభేదించేవారికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఈరోజు సూర్యనమస్కారాలు చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కుంభరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. గ్రహబలంతో చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమాజంలో గుర్తింపు పొందుతారు. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంది. ఈరోజు ఈరాశివారు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.
మీనరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. మీ చుట్టూ శతృవులు ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. విశ్రాంతి తీసుకోవాలి. కుటుంబంలో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి.
గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన రాశి ఫలితాలు మాత్రమే. ఎవరి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇచ్చినవి కాదు. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించండి.