Daily Horoscope: ఈ రాశుల వారికి అరచేతిలోనే అదృష్టం... ప్రతి పనిలో విజయం

ఏకాదశి, ఉత్తరాభాద్ర నక్షత్రం, విష్కంభ యోగం ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో, ఎవరికి అదృష్టం ఉన్నదో, ఎవరి జాతకం ఎలా మారబోతుందో తెలుసుకుందాం.

Update: 2026-05-13 02:06 GMT

Daily Horoscope: ఏకాదశి తిథికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంటుంది. ఈరోజు ఉపవాసం, శ్రీమహావిష్ణువు ఆరాధన, ధ్యానం చేస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు, ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం కావడంతో ఆలోచనల్లో స్థిరత్వం లభిస్తుంది. దీంతో పాటు విష్కంభ యోగం కూడా ఉండటం విశేషం. అయితే, ఈ యోగం కొన్ని రాశులపై ప్రతికూలంగా, మరికొన్ని రాశులకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఏకాదశి, ఉత్తరాభాద్ర నక్షత్రం, విష్కంభ యోగం ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో, ఎవరికి అదృష్టం ఉన్నదో, ఎవరి జాతకం ఎలా మారబోతుందో తెలుసుకుందాం.

మేషరాశి

ఈ రోజు ఈరాశివారు ప్రతి విషయంలో తొందరపడకుండా ఆలోచించి అడుగులు వేయాలి. వ్యాపారంలో మీ నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్య పరంగా అలసట వంటి సమస్యలు రావచ్చు. ప్రయాణాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు ఇష్టదైవాన్ని స్మరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

వృషభరాశి

ఈ రోజు ఈరాశి వారికి అదృష్టం బలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పని పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈరోజు ఈరాశివారు శ్రీలక్ష్మి ప్రార్థన చేయడం వల్ల మరింత శుభఫలితాలు పొందుతారు.

మిథునరాశి

ఈ రోజు ఈరాశివారు ఓర్పుతో వ్యవహరించాలి. ప్రారంభించిన పనుల్లో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా చివరకు విజయం మీదే అవుతుంది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఖర్చులు నియంత్రణలో ఉంచితే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఈరోజు ఈరాశివారు హనుమంతుని ఆరాధన చేయడం వల్ల ధైర్యం పెరుగుతుంది.

కర్కాటకరాశి

ఈ రోజు ఈరాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉన్నతాధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. పదోన్నతి లేదా బాధ్యతల పెరుగుదల వంటి శుభసూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఈరోజు ఈరాశివారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల దైవానుగ్రహం లభిస్తుంది.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో చిన్న విషయాలకే ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. వ్యాపారంలో లాభాలు రావాలంటే సహనం అవసరం. ఆరోగ్య పరంగా నిర్లక్ష్యం మంచిది కాదు. వైద్య ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. ఈరోజు ఈరాశివారు శని ధ్యాన శ్లోకాలు పఠించడం మంచిది.

కన్యారాశి

ఈరోజు ఈరాశి వారికి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. అధికారయోగం కలిసివస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. మీరు చేసే మంచి పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు ఈరాశివారు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలి.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా శుభవార్తలు వింటారు. వ్యాపారంలో నూతన అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ఏకాగ్రతతో పనిచేస్తే ఉన్నత ఫలితాలు సాధిస్తారు. గృహనిర్మాణం లేదా స్థిరాస్తి పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఖర్చులు నియంత్రణలో ఉంచితే మరింత లాభం ఉంటుంది. ఈరోజు ఈరాశివారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చికరాశి

ఈ రోజు ఈ రాశి వారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఉద్యోగంలో ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. ఒక ముఖ్య సంఘటన మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. షేర్ మార్కెట్ పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం. ఈరోజు ఈరాశివారు దుర్గాదేవి ప్రార్థన చేయడం వల్ల మానసిక బలం పెరుగుతుంది.

ధనస్సురాశి

ఈరోజు ఈరాశి వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో భాగస్వాములతో సఖ్యత అవసరం. కుటుంబంలో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఈరాశివారు సూర్య ఆరాధన చేయడం శుభప్రదం.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో క్రమంగా పురోగతి కనిపిస్తుంది. భూ, గృహ, వాహన సంబంధిత విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆస్తి విషయాల్లో మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయడం వలన మానసిక ధైర్యం పెరుగుతుంది.

కుంభరాశి

ఈరోజు ఈరాశి వారికి ఫలితాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో గౌరవం, సన్మానాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెద్దల సహకారం మీకు కలిసివస్తుంది. కొన్ని ఆటంకాలు వచ్చినా బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఖర్చులు నియంత్రణలో ఉంచితే ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. ఈరోజు ఈరాశివారు సుబ్రహ్మణ్య, సూర్యుని ఆరాధన చేయడం మంచిది.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభించిన పనుల్లో ఆలస్యాలు రావచ్చు. వ్యాపార ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం చాలా అవసరం. ఆదాయానికి మించి ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు ఈరాశివారు సూర్యాష్టకం పఠించడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

గమనికః ఇక్కడ ఇచ్చిన ఫలితాలు సామాన్యమైనవి. ఎవరి వ్యక్తిగత జాతకాన్ని ఉద్దేశించి ఉచ్చినవి కావు. వ్యక్తిగత జాతకానికి సంబంధించిన రాశిఫలితాలు కావాలంటే నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.  

Tags:    

Similar News