Parliament: వైసీపీని వెంటాడుతున్న 11.. ఢిల్లీలో గది మార్పించుకున్న ఎంపీలు

Parliament: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని '11' అనే అంకె నీడలా వెంటాడుతోంది.

Update: 2026-03-24 11:40 GMT

Parliament: వైసీపీని వెంటాడుతున్న 11.. ఢిల్లీలో గది మార్పించుకున్న ఎంపీలు

Parliament: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని '11' అనే అంకె నీడలా వెంటాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన ఆ పార్టీకి, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోని కొత్త పార్లమెంటు భవనంలోనూ అదే నంబర్ ఎదురవ్వడం ఎంపీలను విస్మయానికి గురిచేసింది. సెంటిమెంట్ బలంగా పనిచేయడంతో గది నంబర్ మార్చాలంటూ ఏకంగా స్పీకర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది.

పార్లమెంటులో పార్టీల బలాబలాల ఆధారంగా ఎంపీల కోసం గదులను కేటాయించడం ఆనవాయితీ. ఈ క్రమంలో వైసీపీ ఎంపీల కోసం మొదటి అంతస్తులో 11వ నంబర్ గదిని కేటాయించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎంపీలు షాక్‌కు గురయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియాలో '11' అంటూ ప్రత్యర్థులు విపరీతంగా ట్రోల్ చేస్తున్న తరుణంలో, పార్లమెంటులో కూడా అదే నంబర్ ఉంటే మరింత అభాసుపాలవుతామని భయపడ్డారు.

వెంటనే మేల్కొన్న వైసీపీ ఎంపీలు స్పీకర్‌ను కలిసి తమ మొర ఆలకించాలని కోరారు. "11వ నంబర్ మాకు అస్సలు కలిసి రావడం లేదు.. సెంటిమెంట్ పరంగా ఇబ్బందిగా ఉంది" అని వివరించారు. మొదట స్పీకర్ కొంత ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పటికీ, వారి అభ్యర్థనలోని తీవ్రతను గమనించి చివరకు 11వ నంబర్‌కు బదులుగా 12వ నంబర్ గదిని కేటాయించారు. దీంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు, ఏపీలో ఘనవిజయం సాధించి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కింగ్‌మేకర్‌గా ఉన్న తెలుగుదేశం పార్టీకి పార్లమెంటు మొదటి అంతస్తులోనే 9వ నంబర్ గదిని కేటాయించారు. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న గదిని టీడీపీకి కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మొత్తానికి ఏపీ రాజకీయాల్లో మొదలైన '11' సెంటిమెంట్ సెగ ఇప్పుడు ఢిల్లీ పార్లమెంటు గదుల దాకా చేరింది.

Tags:    

Similar News