Nandyal: మార్చి 31 డెడ్‌లైన్.. విద్యుత్ అధికారులకు కలెక్టర్ వార్నింగ్!
Nandyal: మార్చి 31లోగా విద్యుత్ స్తంభాల ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులకు నంద్యాల కలెక్టర్ రాజకుమారి డెడ్‌లైన్. లో-వోల్టేజ్ సమస్యల పరిష్కారమే లక్ష్యం.
Nandyal: మార్చి 31 డెడ్‌లైన్.. విద్యుత్ అధికారులకు కలెక్టర్ వార్నింగ్!
Nandyal: మార్చి 31 నాటికి ఆర్డీఎస్‌ఎస్ (RDSS) పథకం కింద జరుగుతున్న విద్యుత్ స్తంభాల ఏర్పాటు పూర్తి చేయాలి అధికారులకు నంద్యాల కలెక్టర్ రాజా కుమారి ఆదేశం.
నంద్యాల జిల్లాలో ఆర్డీఎస్‌ఎస్ (RDSS) పథకం కింద జరుగుతున్న విద్యుత్ స్తంభాల ఏర్పాటును వేగవంతంగా పూర్తి చేసి, మార్చి 31 నాటికి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచి, ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు.గ్రామాల్లో త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. RDSS పథకం ద్వారా ట్రిప్పులు తగ్గించి, లో వోల్టేజ్ సమస్యలను నివారించి స్థిరమైన విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఆర్ & బీ రహదారుల వెంట 7 ప్రదేశాల్లో విద్యుత్ స్తంభాల పనులు కొనసాగుతున్నాయి..నేషనల్ హైవే పరిధిలో 11 ప్రదేశాల్లో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశం..అటవీ శాఖ పరిధిలో 4 ప్రదేశాల్లో పనులు వేగవంతం చేయాలని సూచన..గాలేరు-నగరి ప్రాజెక్టు పరిసరాల్లో 15 స్తంభాల పనులపై ప్రత్యేక పర్యవేక్షణ..
టోల్ గేట్ల వద్ద అధిక లైటింగ్ కారణంగా పంటల దిగుబడిపై ప్రభావం పడుతోందని రైతులు పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో, ఆ సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, సబ్ డీఎఫ్‌ఓ బబితా కుమారి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంక, ఎస్‌ఈ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.