Srikakulam: సంతలో సాయి జల సేవలు!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మకరాంపురం ఆదివారం సంతలో భక్తులు, వ్యాపారుల కోసం 'సాయి జల ప్రసాద' కేంద్రం ఏర్పాటు.
Srikakulam: సంతలో సాయి జల సేవలు!
శ్రీకాకుళం జిల్లా: కంచిలి మండలం మకరాంపురం గ్రామంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ ధర్మకర్త బెందాళం రమణ ఆధ్వర్యంలో ఆదివారం సంతలో భక్తులు, వ్యాపారులు, ప్రజల కోసం సాయి జల ప్రసాద కేంద్రం ఏర్పాటు చేశారు. మకరాంపురం పంచాయతీ పరిధిలో ప్రతి ఆదివారం జరిగే ఈ సంతకు ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతాల నుంచి వ్యాపారులు భారీగా తరలివస్తున్నారు.
చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు సంతకు హాజరై తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తుండగా, ఈ సంతలో దొరకని వస్తువంటూ లేదని స్థానికులు పేర్కొంటున్నారు.
సంతకు వచ్చే ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకును మంగళవారం కంచిలి ఎస్సై పి. పారినాయుడు ప్రారంభించారు. ఈ జల ప్రసాద కేంద్రం ద్వారా ప్రజలకు ఉపశమనం కలుగుతుందని ధర్మకర్త రమణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బెందాళం అనీల్ కుమార్, బెందాళం విజయ్, బాలక ఆనందరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.