Anantapur: 'ఇంటింటికి కూటమి ప్రభుత్వం'లో అనంతపురం ఫస్ట్.. ఎమ్మెల్యే ప్రశంసలు

Anantapur: "ఇంటింటికి కూటమి ప్రభుత్వం" కార్యక్రమంలో 83 శాతం పురోగతి సాధించినందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి అభినందించారు.

Update: 2026-08-23 10:08 GMT

Anantapur: 'ఇంటింటికి కూటమి ప్రభుత్వం'లో అనంతపురం ఫస్ట్.. ఎమ్మెల్యే ప్రశంసలు

అనంతపురం: అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జిల్లా కార్యాలయానికి విచ్చేసిన ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డిని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతపురం నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతున్న "ఇంటింటికి కూటమి ప్రభుత్వం" డోర్-టు-డోర్ కార్యక్రమం పురోగతిని శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వివరంగా తెలియజేశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఈ కార్యక్రమం 83 శాతం పూర్తయి, అనంతపురం పార్లమెంట్ పరిధిలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ పిలుపును ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్తున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

నూతన ఎమ్మెల్సీకి సత్కారం కార్యక్రమం అనంతరం, ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి ని పార్టీ నాయకులు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, ఏడీసీసీ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి.

Tags:    

Similar News