Kadiri: కదిరిలో మెగా జాబ్ మేళా 30కి పైగా కంపెనీలు 1000+ ఉద్యోగాలు
Kadiri: కదిరి వాల్మీకి స్కూల్‌లో అభిజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభం.
Kadiri: కదిరిలో మెగా జాబ్ మేళా 30కి పైగా కంపెనీలు 1000+ ఉద్యోగాలు
Kadiri: కదిరి నియోజకవర్గంలో అభిజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మెగా జాబ్‌మేళా నిర్వహించారు. వాల్మీకి విద్యా సంస్థల డైరెక్టర్ డా. పి.వి. పవన్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్‌మేళాకు కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని వాల్మీకి స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు కదిరి నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత తరలివచ్చారు. 30కి పైగా కంపెనీలు పాల్గొని వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జాబ్‌మేళా నిర్వహణను పరిశీలించి, ఉద్యోగాల కోసం వచ్చిన యువతతో మాట్లాడారు. యువతలో ప్రతిభకు కొదవ లేదని, సరైన అవకాశం, మార్గదర్శకత్వం లభిస్తే ఉన్నత స్థాయికి ఎదగగలరని ఎమ్మెల్యే తెలిపారు. అర్హత, నైపుణ్యం ఉన్న ప్రతి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
జాబ్‌మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఎమ్మెల్యే అభినందించారు. స్థానికంగా ఇలాంటి జాబ్‌మేళాలు నిర్వహించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. అభిజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయమని, వాల్మీకి విద్యా సంస్థల డైరెక్టర్ డా. పి.వి. పవన్ కుమార్ రెడ్డిని, అనిల్ కుమార్ రెడ్డిని, ఎమ్మెల్యే అభినందించారు.
యువత తమ విద్యార్హతలు, నైపుణ్యాలను పెంపొందించుకుని అందుబాటులోకి వచ్చే ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, అభిజ్ఞ ఫౌండేషన్ సభ్యులు, వాల్మీకి విద్యా సంస్థల ప్రతినిధులు, యువత, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.