Siddipet: రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ లక్ష్యం

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుటలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ లక్ష్యమని నేతల వెల్లడి.

Update: 2026-08-21 06:09 GMT

Siddipet: రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ లక్ష్యం

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశాన్ని ఆధునిక, సాంకేతిక శక్తిగా తీర్చిదిద్దడంలో రాజీవ్ గాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించి, దేశ భవిష్యత్తును యువశక్తితో నిర్మించాలనే ఆలోచనతో ఆయన ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు.

దేశంలో కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ వేసిన పునాదులు నేటి డిజిటల్ భారతానికి ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, యువతకు ఓటు హక్కు కల్పించడం వంటి నిర్ణయాలు ఆయన దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలు, దేశాభివృద్ధి పట్ల ఆయన కలలను సాకారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News