Pamidi: స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధం కావాలి – వెంకటరామిరెడ్డి

Pamidi: అనంతపురం జిల్లా పామిడి కేసర నిలయంలో గుంతకల్లు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకుల సమావేశం. స్థానిక ఎన్నికల్లో విజయామే లక్ష్యంగా పిలుపు.

Update: 2026-08-21 14:41 GMT

Pamidi: స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధం కావాలి – వెంకటరామిరెడ్డి

పామిడి: గుంతకల్లు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పామిడి మండల నాయకులు, కార్యకర్తల సమావేశం పామిడి పట్టణంలోని కేసర నిలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికలకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడేలా అన్ని స్థానాలు గెలవాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని సూచించారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పామిడి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News