Kadiri: సిమ్స్ ఎండీ నిసార్ యాసీన్.. 7 నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలోని 10, 11, 12వ వార్డుల్లో సిమ్స్ హాస్పిటల్ ఎండీ నిసార్ యాసీన్ పర్యటించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Update: 2026-08-23 09:56 GMT

Kadiri: సిమ్స్ ఎండీ నిసార్ యాసీన్.. 7 నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా!

కదిరి: సత్యసాయి జిల్లా కదిరిలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నేరుగా ప్రజల గడప వద్దకు వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టారు కదిరి సిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, NYPSN ఫౌండర్ నిసార్ యాసీన్.

కదిరి పట్టణంలోని మషాణం పేట, మేదర వీధుల వెనుక ప్రాంతాల్లోని 10, 11, 12వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు.

ఈ సందర్భంగా సుమారు 300 ఇళ్లను స్వయంగా సందర్శించి, కుటుంబాల ఆర్థిక పరిస్థితులు,ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి వద్దకు వెళ్లి వారి అవసరాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. వారిలో అత్యవసరంగా సహాయం అవసరమైన 7 నిరుపేద కుటుంబాలను గుర్తించి, వెంటనే వారికి ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా నిసార్ యాసీన్ మాట్లాడుతూ, “ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వారు నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదని, నేనే వారి గడప వద్దకు వస్తానన్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు చేతనైనంత సహాయం చేయడం నా బాధ్యత అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఈ సేవా కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని అన్నారు.

ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్థిక భరోసా కల్పించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి స్వయంగా వచ్చి సహాయం అందించిన నిసార్ యాసీన్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News