Guntakal: మండి బజార్ ELSR ట్యాంక్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్!
Guntakal: గుంతకల్లు పట్టణంలోని మండి బజార్ ELSR ట్యాంక్‌ను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి ఆకస్మికంగా తనిఖీ చేసి, తాగునీటి సరఫరాపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Guntakal: మండి బజార్ ELSR ట్యాంక్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్!
Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ పురపాలక సంఘం పరిధిలోని మండి బజార్ ELSR ట్యాంక్ ను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె వెంట మున్సిపల్ ఇంజనీర్ ఇంతియాజ్ ఉన్నారు.
కమిషనర్ ట్యాంక్ పరిసరాలను, నీటి నిల్వను పరిశీలించారు. అనంతరం ట్యాంకర్ లోడింగ్ విధానం మరియు ట్యాంకర్ తిరిగే రూట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తనిఖీ సమయంలో వాటర్ వాల్ నుండి లీకేజీ అవుతున్నట్లు గమనించిన కమిషనర్, వెంటనే వాల్ ను సరిచేయాలని అక్కడే ఉన్న ఫిట్టర్ కు సూచించారు. తాగునీటి వృధా జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అదేవిధంగా ట్యాంక్ ఆవరణలో ఎలాంటి చెత్త లేకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని వాచ్‌మెన్ కు ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని హెచ్చరించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రమం తప్పకుండా తాగునీరు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.