Kadiri: డ్రంక్ అండ్ డ్రైవ్‌కు జైలు శిక్ష, జరిమానా కదిరి పోలీసులు
Kadiri: కదిరిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 6 మందిపై కేసులు. ఐదుగురికి జరిమానా, ఒకరికి 7 రోజుల జైలు శిక్ష విధించిన కోర్టు. 15 మందిపై న్యూసెన్స్ కేసులు.
Kadiri: డ్రంక్ అండ్ డ్రైవ్‌కు జైలు శిక్ష, జరిమానా కదిరి పోలీసులు
కదిరి: ఈ రోజు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 6 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేసి, వారిని గౌరవ కదిరి Spl. Judicial Second Class Magistrate గారి ఎదుట హాజరుపరచడం జరిగింది. కేసు విచారణ అనంతరం వీరిలో 5 మందికి ఒక్కొక్కరికి రూ. 10,000/- చొప్పున జరిమానా మరియు ఒకరికి 7 రోజుల జైలు శిక్ష విధిస్తూ గౌరవ న్యాయమూర్తి గారు తీర్పు వెలువరించారు.
అదేవిధంగా, కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ప్రజలకు అసౌకర్యం (న్యూసెన్స్) కలిగించిన 15 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేసి, వారిని సైతం కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. వీరందరికీ గౌరవ కదిరి Spl. Judicial Second Class Magistrate గారు జరిమానా విధించి తీర్పు వెలువరించారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాలలో అసౌకర్యం కలిగించే చర్యలకు పాల్పడటం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను కదిరి టౌన్ పోలీసులు నిరంతరం నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని మరియు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని పోలీసులు కోరుతున్నారు.