Guntakal: ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

Guntakal: పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.

Update: 2026-08-03 10:32 GMT

Guntakal: ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్

- గుంతకల్లు SKP కాలేజీలో ABVP కరపత్రాల విడుదల

గుంతకల్లు: ABVP ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ మేరకు కరపత్రాలను విడుదల చేశారు.

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని SKP జూనియర్ కాలేజీ*లో ABVP నాయకులు కరపత్రాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ABVP అనంతపురం జిల్లా కన్వీనర్ శివరాజ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే బంద్ పిలుపునిచ్చామని తెలిపారు.

ప్రధాన డిమాండ్లు:

1. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

2. డిగ్రీతో సహా అన్ని కోర్సుల పరీక్షలను ఒక్కసారిగా పూర్తి చేయాలి

3. అన్ని విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ అకడమిక్ క్యాలెండర్ ను ప్రకటించాలి

4. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులను పెంచాలి

5. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ను ఏర్పాటు చేయాలి

ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలను బంద్ చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ముత్యానంద, ఉపాధ్యక్షులు జయరాం, సాయి, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:    

Similar News