Dharmavaram: ప్రమాణ స్వీకారం కాకనే బాధ్యతల్లో మునిగిన కౌన్సిలర్ మాధవరెడ్డి!

Dharmavaram: ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ మాధవరెడ్డి తన ప్రమాణ స్వీకారం కాకనే వార్డులో ఉన్న సమస్యలపై దృష్టి సారించారు. డ్రైనేజీ కాలువలో చెత్త పేరుకు పోయి మురుగునీరు రోడ్డుపైకి వచ్చి దుర్వాసన వెదజల్లుతూ ఉండడంతో ప్రజలు కౌన్సిలర్ మాధవరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన మాధవరెడ్డి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పిలిపించి డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగింప చేశారు. సమస్యలపై తక్షణమే స్పందించిన మాధవరెడ్డిని వార్డు ప్రజలు అభినందించారు. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించినందుకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరింప చేస్తానని మాధవరెడ్డి తెలిపారు.

Tags: