Adilabad: తలమడుగులో పెద్దపులి కలకలం: పంటచేలల్లో ప్రత్యక్షం!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కడపల్లి గ్రామ పంటచేలల్లో పెద్దపులి కనిపించడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు.

Update: 2026-09-02 13:27 GMT

Adilabad: తలమడుగులో పెద్దపులి కలకలం: పంటచేలల్లో ప్రత్యక్షం!

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సకినాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కడపల్లి గ్రామ పంటచేన్ల వద్ద పెద్దపులి కనిపించిందన్న వార్త కలకలం రేపుతోంది. స్థానిక యువకుడు పులిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వైరల్‌గా మారింది.

గత కొద్దిరోజులుగా పులి సంచారం ఉందన్న ప్రచారం ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. తాజాగా పులి కనిపించడంతో రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు వెంటనే స్పందించి పులి సంచారాన్ని నిర్ధారించి, ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు పులి ఆనవాళ్లు గుర్తించడానికి అటవీ శాఖ అధికారులు పనిలో పడ్డారు.

Tags:    

Similar News