Nirmal: ముధోల్‌లో రాత్రి వేళల్లో మోరం అక్రమ రవాణా నిద్రపోతున్న అధికారులు!

Nirmal: నిర్మల్ జిల్లా ముధోల్ నుంచి బాసరకు నిబంధనలు తుంగలో తొక్కి మోరం అక్రమ రవాణా. అధికార పార్టీ నేత హస్తం ఉందనే ఆరోపణలు, చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్.

Update: 2026-09-02 05:50 GMT

Nirmal: ముధోల్‌లో రాత్రి వేళల్లో మోరం అక్రమ రవాణా నిద్రపోతున్న అధికారులు!

Nirmal: చీకటి పడితే చాలు అక్రమార్కులు రంగంలోకి దిగుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా మోరం అక్రమ రవాణా నిర్మల్ జిల్లా ముధోల్ శివారు నుంచి బాసర కు సాగిస్తున్నారు.

పగటి పూట ఏమీ తెలియనట్టు ఉండే దందాపరులు, రాత్రి వేళల్లో వందల టన్నుల మొరాన్ని తరలిస్తూ సహజ వనరులను కొల్లగొడుతున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక అధికార పార్టీకి చెందిన నాయకుడు నడుపుతున్నట్లు వెల్లువెత్తుతున్నాయి.

స్థానిక అధికారుల కళ్లు గప్పేందుకు, పక్కా పథకం ప్రకారం మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన భారీ వాహనాల్లో ఈ అక్రమ రవాణా సాగిస్తుండటంతో పాటు అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోక పోవడం గమనార్హం.

Tags:    

Similar News