Nirmal: నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం!

Nirmal: నిర్మల్ ఆర్డీవో ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం: బిజెపి నేతలు ఎన్. రామచందర్ రావు, ఏలేటి అరెస్ట్‌పై నిరసన.

Update: 2026-09-01 11:31 GMT

Nirmal: నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం!

Nirmal: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మల్‌లోని RDO కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ నిరసన వ్యక్తం చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని నాయకులు పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మెడిశెమ్మ రాజు, సాదం అరవింద్, BJYM జిల్లా అధ్యక్షులు దొడ్డికింది నిరంజన్ రెడ్డి, కౌన్సిలర్లు గంజి రాజు, కూన శశాంక్, సాత్విక్, ఈశ్వర్, మరియు వెంకటేష్, ఉదయ్, సాయి రెడ్డి, విజయ్, ఒడ్నాల రాజు భరత్, హరీష్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News