Nirmal: ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్‌లలో ఐడీ మద్యం స్వాధీనం!
Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్ మండలాల్లో ఎక్సైజ్ శాఖ మెరుపు దాడులు నిర్వహించింది.
Nirmal: ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్‌లలో ఐడీ మద్యం స్వాధీనం!
నిర్మల్: నిర్మల్ జిల్లా ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. అసిస్టెంట్ కమిషనర్ ఎక్సైజ్ ఆదిలాబాద్, డీపీఈఓ ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు నిర్మల్ ఎస్‌హెచ్‌ఓ సిబ్బందితో కలిసి ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్ మండలాల్లో మెరుపు దాడులు నిర్వహించారు.
ఖానాపూర్ మండలంలోని మాస్కాపూర్, పెంబి మండలంలోని మండపల్లి, ఇక్బాల్‌పూర్ ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇక్బాల్‌పూర్‌లో బుక్యా మోహన్ చిన్నయ్య అనే వ్యక్తి ఐడీ మద్యం, నల్లబెల్లం, పటికతో అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అటు దస్తురాబాద్ మండలంలోనూ పలుచోట్ల తనిఖీలు చేసి అక్రమ ఐడీ మద్యం విక్రయాలపై కేసులు నమోదు చేశారు.ఈ దాడుల్లో మొత్తంగా 6 కేసులు నమోదు చేసి, ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
వారి నుంచి 32 లీటర్ల ఐడీ మద్యం, 20 కిలోల నల్లబెల్లం, 3 కిలోల పటికతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఐడీ మద్యం తయారు చేసినా, విక్రయించినా ఎక్సైజ్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రంగస్వామి హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐలు అక్బర్ హుస్సేన్, గంగారెడ్డి, నిర్మల్ ఎస్‌ఐ అభిషేకర్ మరియు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.