Dasturabad: దస్తురాబాద్ పాఠశాలలో అంబరాన్నంటిన కృష్ణాష్టమి సంబరాలు
Dasturabad: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ శ్రీ కృష్ణవేణి పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. చిన్నారి విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించారు.
Dasturabad: దస్తురాబాద్ పాఠశాలలో అంబరాన్నంటిన కృష్ణాష్టమి సంబరాలు
దస్తురాబాద్: నిర్మల్ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముందస్తుగా అంబరాన్నంటాయి. దస్తురాబాద్ మండల కేంద్రంలోని మున్యాల్ శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో కృష్ణాష్టమి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల చిన్నారి విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణల్లో మెరిసిపోతూ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని మున్యాల్ శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం గోకులమును తలపించింది.
పాఠశాల చిన్నారి విద్యార్థులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. చేతిలో పిల్లనగ్రోవి పట్టుకుని కొందరు చిన్నారులు ముద్దుల కృష్ణుడిగా అలరిస్తే... పట్టు లంగాలు, సాంప్రదాయ వస్త్రాలు, ఆభరణాలు ధరించి బాలికలు గోపికల రూపంలో కనువిందు చేశారు.
చిన్నారులు చేసిన సాంప్రదాయ నాట్యాలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమ పిల్లలు దైవ స్వరూపాల్లో ముద్దులొలికేలా తయారై నాట్యం చేస్తుంటే చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పించాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంది.