నేను ప్రిన్స్ ముఖరంజా వారసురాలినే.. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
Zairin Mukarram Jah: నా తల్లి జమీలా 1993 సెప్టెంబర్ 8న ముఖరంజాను పెళ్లి చేసుకున్నారు
నేను ప్రిన్స్ ముఖరంజా వారసురాలినే.. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
Zairin Mukarram Jah: తాను ప్రిన్స్ ముఖరంజా కూతుర్ని కాదని కొంతమంది సమాజంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నకిలీ డీఎన్‌ఏ రిపోర్ట్ సోషల్ మీడియాలో చలామణి చేస్తున్నారని ప్రిన్స్ ముఖరంజా బహదూర్ కూతురు జైరిన్ ముకరంజా ఆరోపించారు. తాను ప్రిన్స్ ముఖరంజా, ప్రిన్సెస్ జమీలా బౌలారాస్‌లకు 1994 జూలై 6న జన్మించానని అన్నారు. తన తల్లి జమీలా 1993 సెప్టెంబర్ 8న ముఖరంజాను పెళ్లి చేసుకున్నారని అన్నారు. వారిద్దరి పెళ్లి సర్టిఫికెట్, తన బర్త్ సర్టిఫికెట్‌లను మీడియాకు చూపించారు. డీఎన్‌ఏ రిపోర్టును కూడా మీడియా ముందు ఉంచారు. తన వద్ద అన్ని పత్రాలు ఉన్నాయన్నారు. తాను ముఖరంజా కూతురినని, ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు.