వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన

Delhi: సీబీఐని కలవనున్న వైయస్ షర్మిల

Update: 2022-10-07 06:04 GMT

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన

Delhi: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వైయస్ షర్మిల సిబిఐని కలవనున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులతోపాటు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై షర్మిల సీబీఐకి ఫిర్యాదు చేయనున్నారు. కొంతకాలంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరుగుతుందంటూ పాదయాత్రలో విమర్శలు కూడా చేస్తున్నారు. దీంట్లో భాగంగానే షర్మిల ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర హోంశాఖ అధికారులను కలువనుందని సమాచారం... ఢిల్లోలో షర్మిల 2:30 మీడియా సమావేశంలో మాట్లాడనుంది.

Tags:    

Similar News