శంషాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై యువకుల హల్‌చల్
* నిబంధనలు ఉల్లంఘించి డ్రోన్ కెమెరాలతో షూటింగ్ * షార్ట్‌ఫిల్మ్ షూటింగ్ పేరుతో ఔటర్‌రింగ్ రోడ్డుపై హంగామా * పత్తాలేని ఔటర్‌రింగ్ రోడ్డు సిబ్బంది, పోలీసులు
outer ring road (file image)
శంషాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై కొందరు యువకులు హల్‌చల్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి డ్రోన్ కెమెరాలతో షూటింగ్ చేశారు. షార్ట్‌ఫిల్మ్ షూటింగ్ పేరుతో ఔటర్‌రింగ్ రోడ్డుపై హంగామా చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డుపై గంటల తరబడి యువకులు షూటింగ్ చేస్తున్నప్పటికీ వారికి అడ్డుచెప్పేవారెవరూ లేకపోయారు. ఔటర్ రింగ్‌పై వాహనాల పార్కింగ్‌కే అనుమతి లేదు.అటువంటిది కొందరు యువకులు డ్రోన్ కెమెరాలతో షూటింగ్ చేస్తున్నా ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బందిగానీ పోలీసులు గానీ ఆ ప్రాంతంలో లేకపోవడం విశేషం