Telangana: నెలాఖరులోపు యాసంగి రైతుబంధు

*కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతులకు కూడా నగదు *సీఎం ఢిల్లీ పర్యటన ముగియగానే ఆదేశాలు

Update: 2021-11-22 02:30 GMT

నెలాఖరులోపు యాసంగి రైతుబంధు(ఫైల్ ఫోటో)

Telangana: యాసంగి సీజన్‌ పంటల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతుబంధు నిధులు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఎకరానికి 5వేల చొప్పున ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థికశాఖ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈనెలాఖరు వరకు రైతుబంధు నిధుల పంపిణీ ప్రారంభిస్తారని సమాచారం. కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతులకు కూడా డబ్బులను విడుదల చేయనున్నారు.

గడిచిన వానాకాలం సీజన్‌లో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండెకరాలు, మూడో రోజు మూడెకరాలు ఇలా ఆరోహణ పద్ధతిలో బదిలీ చేశారు. అయితే ఈసారి కూడా అదే పద్ధతిని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ ఈనెలాఖరు వరకు నిధులు సర్దుబాటు కాకపోతే డిసెంబర్‌ మొదటి వారంలో రైతుబంధు ఆర్థిక సహాయం పంపిణీ ఉంటుందని సమాచారం.

Tags:    

Similar News