యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..రేపటి నుంచి ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్దిగాంచిన దేవాలయాలలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒకటి.

Update: 2020-02-25 08:47 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్దిగాంచిన దేవాలయాలలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించిన విధంగానే ఈ ఏడాది కూడా వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా చేయనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 26వ తేది నుంచి మార్చి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీన అలంకార సేవ, మార్చి 3వ తేదీన ఎదుర్కోలు, మార్చి 4వ తేదీన తిరుకల్యాణం, మార్చి 5వ తేదీన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం, మార్చి 7వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీంతో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవం ముగుస్తుంది. ఇందులో భాగంగానే మార్చి 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు యాదాద్రిలో సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్నాయి.

ఇక పోతే బ్రహ్మోత్సవ ఉత్సవాల సందర్భంగా యాదాద్రిలో జరిపే నిత్యపూజల్లో స్వల్ప మార్పులు చేయనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు శాశ్వత మొక్కులు, కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమాలు రద్దు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని కోరారు. ఇక ప్రధాన ఆలయ విస్తరణ పనులు జరుగుతుండటంతో బ్రహ్మోత్సవ వేడుకలు బాలాలయంలోనే నిర్వహించనున్నారు.

Tags:    

Similar News