Lakshmi Narasimha Swamy Temple : యాదాద్రిలో దర్శనాలు మూడ్రోజులు నిలిపివేత

Update: 2020-09-09 05:59 GMT

యాదాద్రి ఆలయం

Lakshmi Narasimha Swamy Temple  : కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో దర్శనాలను నిలిపివేసేందుకు ఆలయ అధికారులు నిర్ణయం తీసుకన్నట్టు తెలిపారు. ఈ మేరకు నేటి నుంచి మూడు రోజుల పాటు భక్తులను ఆలయ ప్రవేశం లేదని స్పష్టం చేసారు. నూతనంగా నిర్మించిన ఆలయంతో పాటు పాతగుట్ట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలోనూ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి నిత్యం స్వామి వారికి నిర్వహించే నిత్య కైంకర్యాలను పండితులు ఏకాంతంగా నిర్వహించనున్నారు. లాక్ డౌన్ సమయంలో భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఆన్‌లైన్‌ సేవలు, దర్శనాలు అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేసారు. యాదగిరిగుట్టలో కరోనా కేసులు పెరుగుతుండడంతో భక్తుల దర్శనాలు నిలిపివేయాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతకు ఇప్పటికే పలు పార్టీల నాయకులు ఎమ్మెల్యే, వినతి పత్రాలు అందజేశారు. సోమవారం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మర్యాదపూర్వకంగా కలిసి ప్రజాప్రతినిధులు, స్థానికులు లాక్‌డౌన్‌ విధించాలని కోరారని విప్‌ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాక యాదాద్రిలో ప్రధానార్చకులతో పాటు మరో ఇద్దరు అర్చకులకు, ఆలయ సిబ్బంధికి వైరస్‌ సోకవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. వైరస్ ను కట్టడి చేసేందుకే మూడు రోజుల పాటు దర్శనాలు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇక పోతే యాదాద్రి యాదాద్రి పుణ్యక్షేత్రానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు తరలి వచ్చేలా అద్భుతంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరేలా అక్కడ పచ్చదనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానితో గోపురం పరిసర ప్రాంతం అరణ్యాలు, గార్డెన్లు, చెట్ల మొక్కలు, రంగురంగుల పూల మొక్కలతో గ్రీన్ జోన్ గా మారిపోయింది. యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మిస్తోంది. దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనులతో యాదాద్రిలో ఎక్కడ చూసిన కొత్త నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు యాదగిరిగుట్టను చూసిన వారు ఇపుడు యాదాద్రిని చూస్తే ఆ ప్రాంత అభివృద్ధిని అసలు నమ్మలేకపోతున్నారు. భక్తులకు స్వామి వారి దర్శనం ఎంత ముఖ్యమో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం కూడా అంతే లక్ష్యంగా వైటీడీఏ పనులను చేపడుతోంది.

Tags:    

Similar News