Bopparaju Venkateswarlu: ఈనెల 21 నుండి వర్క్‌ టు రూల్ ఆందోళన

Bopparaju Venkateswarlu: ఉద్యోగుల బకాయిలపై అసెంబ్లీ వేదికగా ప్రకటించాలి

Update: 2023-03-20 12:52 GMT

Bopparaju Venkateswarlu: ఈనెల 21 నుండి వర్క్‌ టు రూల్ ఆందోళన

Bopparaju Venkateswarlu: ఈనెల 21 నుండి వర్క్‌ టు రూల్ ఆందోళన చేస్తామని ఏపీ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 9 నుండి రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ఉద్యోగుల ఆందోళనకు మద్దతుగా సోమవారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ఆందోళనలో బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఉద్యోగుల బకాయిలపై అసెంబ్లీ వేదికగా ప్రకటించాలన్నారు.

Tags:    

Similar News