Road Accident: అతివేగంతో కారు నడిపి మహిళ మరణానికి కారణమైన సీఐ కొడుకు
Road Accident: హనుమకొండ జిల్లా కాజీపేట్‌లో ఓ వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్‌కు మహిళ బలైపోయింది.
Road Accident: అతివేగంతో కారు నడిపి మహిళ మరణానికి కారణమైన సీఐ కొడుకు
Road Accident: హనుమకొండ జిల్లా కాజీపేట్‌లో ఓ వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్‌కు మహిళ బలైపోయింది. సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ వద్ద బైక్ ఎక్కుతున్న మహిళను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే మహిళ మృతి చెందింది. నిందితుడు ఎక్సైజ్ సీఐ శరత్ కొడుకు వంశీగా గుర్తించారు. వంశీని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట మృతుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఫాతిమానగర్ జంక్షన్‌లో ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.