న్యాయం చేయాలంటూ సెల్‌ టవర్‌ ఎక్కిన మహిళ..

భూ వివాదం పరిష్కరించాలంటూ ఓ మహిళ ఏకంగా సెల్‌ టవర్‌ ఎక్కింది. ఎవరు చెప్పిన కానీ వినడం లేదు. తనకు న్యాయం జరిగితే కానీ తాను కిందకు రాను అని మొండికేసి కూర్చుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని కడపర్థిలో చోటుచేసుకుంది.

Update: 2019-08-31 05:45 GMT

భూ వివాదం పరిష్కరించాలంటూ ఓ మహిళ ఏకంగా సెల్‌ టవర్‌ ఎక్కింది. ఎవరు చెప్పిన కానీ వినడం లేదు. తనకు న్యాయం జరిగితే కానీ తాను కిందకు రాను అని మొండికేసి కూర్చుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని కడపర్థిలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే.. నకిరేకల్‌ మండలం కడపర్థికి చెందిన సోమయ్యకు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్యకు పిల్లలు కాకపోవడంతో అంజమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.

ఎనిమిదేళ్ల క్రితం సోమయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. అయితే చనిపోవడానికి ముందే సోమయ్య ఇద్దరి భార్యలకు రెండెకరాల భూమిని సమానంగా పంచాడు. ఇక ఈ ఏడాది అంజమ్మ తన పొలంతో పాటు పక్కనే ఉన్న మొదటి భార్య పొలాన్ని కూడా దున్నింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అయితే ఈ వివాదం ఎంతకి కూడా తెగకపోవడంతో తనకు న్యాయం చేయాలంటూ అంజమ్మ సెల్‌ టవర్‌ ఎక్కింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా కడపర్థి చేరుకుని అంజమ్మను కిందకు దించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News