Warangal: వరంగల్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం..
వరంగల్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం మైలారం ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల నిర్వహణ తరగతి గది ముందు ముగ్గు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పాఠశాలకు వచ్చి ముగ్గును చూసి భయపడ్డ విద్యార్థులు
వరంగల్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం..
వరంగల్ జిల్లాలోని క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. రాయపర్తి మండలం మైలారం ప్రభుత్వ పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. నిన్న అర్ధరాత్రి పాఠశాల తరగతి గది ముందు ముగ్గు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించాయి. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు అక్కడి పరిస్థితిని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఉపాధ్యాయుల ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్షుద్ర పూజలు చేశారని పాఠశాల వర్గాలు చెబుతుంటే...ఇది ఆకతాయిల పని అంటూ మరికొందరు చెప్పుకొస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలో ఇలాంటి వికృత పనులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరారు.