Booster Dose: కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో కొత్త టెన్షన్

*రెండు డోసులు తీసుకున్న వారిలో కొత్త లక్షణాలు *బూస్టార్‌ డోస్‌ తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యుల సూచన

Update: 2021-10-18 08:15 GMT

 బూస్టర్ డోస్ వ్యాక్సిన్(ఫైల్ ఫోటో)

Booster Dose: వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందా రెండు డోసులు కంప్లీట్‌ అయ్యాయా. ఇక కరోనాకు భయం లేదని ఫీలవుతున్నారా ఇదంతా పక్కనపెడితే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

రెండు డోసులు తీసుకున్న వారు 6నెలల తర్వాత బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవచ్చని WHO వెల్లడించింది. తొలత జాన్సన్ జాన్సన్ కి అనుమతి లభించింది. ఆ తర్వాత మోడోర్న, ఫైజర్ అన్నింటికీ బూస్టర్ డోస్ అనుమతులు వచ్చాయని డాక్టర్ సాయి తెలిపారు. 65 ఏళ్లు నిండిన వారికి అలాగే 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సిన్ మొదటి డోస్ 70 శాతానికి పైగా పూర్తయ్యింది. రెండవ డోస్ 30 శాతం మాత్రమే కంప్లీట్‌ అయ్యిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇంకా తెలంగాణలో అందుబాటులోకి రాలేదని తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. అనుమతులు వస్తే బూస్టర్ డోస్ కి అవకాశాలు ఉన్నాయని అన్నారు. 

Tags:    

Similar News