తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

Update: 2020-05-21 12:34 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.వాయవ్య దిశ నుంచి తెలంగాణ వైపు ఈదురుగాలులు వీస్తుండడంతో రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మూడు రోజులు రాష్ట్రాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. రెండు రోజుల్లో గాలిలో తేమ పూర్తిగా తగ్గిపోయి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రాల్లో ఈ పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది.

కొన్ని చోట్ల సాధారణం కంటే 5డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఒక్క సారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతతో జనం ఉక్కిబిక్కిరి అవుతున్నారు. ముసలి వారు, చిన్న పిల్లలు అసలు బయటికి రాకుండా, డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  

Tags:    

Similar News