Gangula Kamalakar: RBI నిబంధనలు ఉల్లంఘించి మేము వ్యాపారం చేయడం లేదు
Gangula Kamalakar: శ్వేత గ్రానైట్స్ ఏజెన్సీ పూర్తిగా లీగల్ గా బిజినెస్ చేస్తుంది
Gangula Kamalakar: RBI నిబంధనలు ఉల్లంఘించి మేము వ్యాపారం చేయడం లేదు
Gangula Kamalakar: కరీంనగర్ జిల్లాలో తమ కుటుంబం ఏమీ ఇల్లీగల్ గ్రానైట్ వ్యాపారం చేయడం లేదన్నారు మంత్రి గంగుల కమలాకర్. శ్వేతా గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులపై మంత్రి స్పందించారు. తమ కుటుంబ నడిపిస్తున్న శ్వేతా గ్రానైట్ కంపెనీకి నోటీసులు వచ్చాయా లేదా అనేది తనకు ఇంకా సమాచారం లేదన్నారు. ఒకవేళ నోటీసులు వచ్చినా ఇబ్బంది లేదన్నారు. ఏ దర్యాప్తు సంస్థ నోటీసులు ఇచ్చినా సహకరిస్తామన్నారు మంత్రి. ఏ డాక్యుమెంట్ కావాలన్నా ఇస్తామన్నారు. శ్వేత గ్రానైట్స్ ఏజెన్సీ పూర్తిగా లీగల్ గా బిజినెస్ చేస్తుందని మంత్రి వివరణ ఇచ్చారు. Rbi నిబంధనలు ఉల్లంఘించి తాము వ్యాపారం చేయడం లేదన్నారు.