జలకళ సంతరించుకున్న కిన్నెరసాని ప్రాజెక్టు
కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
జలకళ సంతరించుకున్న కిన్నెరసాని ప్రాజెక్టు
Kinnerasani Project: ఎక్కువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులుకగా.. ప్రస్తుత నీటిమట్టం 404.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు వరద నీరు భారీగా పెరగడంతో ఆరు గేట్లు ఎత్తి, 35వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.