VRO Expelled : వీఆర్ఓపై కుల బహిష్కరణ వేటు..ఎందుకో తెలుసా

Update: 2020-09-23 13:56 GMT

VRO Expelled : న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు పెరిగినా ఇప్పటికీ చిన్న చిన్న గ్రామాల్లో మనం తరచూ ఊరి పెద్దల పంచాయతీలను, తీర్పులను చూస్తూనే ఉంటాం. వింటూనే ఉంటాం. అంతే కాదు తప్పుచేసిన వారికి బహిరంగంగానే శిక్షలు కూడా విధిస్తుంటారు. గ్రామంలో నెలకొని ఉన్న సమస్యల్ని పరిష్కరించుకునేందుకు, తగాదాలను ఊరి పెద్దలు కొందరు రచ్చబండ ఏర్పాటు చేసి సమస్యల్ని ఎక్కడికక్కడ పరిష్కరిస్తూ ఉంటారు. దీంతో ఆ గ్రమాలకు చెందిన ప్రజలు ఎవరూ కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కకుండా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇలాంటివి ప్రతీ రాష్ట్రంలో నేటికి ఏదో ఓ మూల జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ వీఆర్‌ఓపై కుల బహిష్కరణ వేటు వేశారు గ్రామ పెద్దలు.

ఈ దారుణమైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. జనగామ మండలం యశ్వంతపూర్‌లో వీఆర్‌ఓపై కుల బహిష్కరణ వేటు వేశారు. అసలు ఎందుకు గ్రామస్థులు ఇలాంటి పనిని చేసారు. ఆ వీఆర్వో చేసిన తప్పేంటి అని అనుకోవచ్చు. కానీ అక్కడ తప్పు ఆ వీఆర్వోది కాదు. ఆ ఉద్యోగానిది. అదేంటి అనుకుంటున్నారా. అవును తన తండ్రి ద్వారా సంక్రమించిన వీఆర్ఓ ఉద్యోగం కోసం 15 లక్షల రూపాయలను పాలివాళ్లు డిమాండ్ చేశారు. కానీ ఓ వీఆర్వో తన దగ్గర డబ్బులేదని నేను అంత ఇచ్చుకోలేనని తెలిపాడు. దీంతో పాలివాళ్లు, ఆ గ్రామస్థులు బాధితుడిని కులబహిష్కరణ చేసారు. దాంతో ఊరుకోక అతనికి శిరోముండనం కూడా చేయాలని గ్రామ పెద్దలు అనాగరిక తీర్పును ఇచ్చారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News