Viral Story Video: ఇల్లు మునిగిపోతే.. ఈత సరదా తీర్చుకుంటున్న మహిళ!

నీళ్ళంటే అందరికీ సరదానే.. నీళ్ళలోకి దిగి ఈత కొట్టాలనే ఆశ చాలామందికి ఉంటుంది. కానీ భయంతోనో.. తెలీని ఇబ్బంది తోనో ఆ పని చేయడానికి సాహసించరు. అయితే, వర్షాలు ఇంటిని మున్చేస్తే తన సరదా తీర్చుకుంటున్న మహిళ.. ఆమె సరదా తీరుస్తున్న భర్త వీడియో ఇప్పుడు వైరల్.. మరి మీరూ చూడండి ఆ సరదా..

Update: 2019-09-26 06:28 GMT

రెండ్రోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షంతో హైదరాబాద్‌‌లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి సైతం వర్షపు నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, మల్లేపల్లి హబీబ్‌నగర్‌‌ నాలా మహ్మద్ హాస్పిటల్ ప్రాంతంలో ఒక ఇంట్లోకి నడుము నీళ్లు రావడంతో ఆ నీటిలో మహిళ ఈత నేర్చుకుంటున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Full View

Tags:    

Similar News