Vemula Prashanth Reddy: ప్రధాని మోడీ అబద్ధాల కోరు
Vemula Prashanth Reddy: కేసీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేయడం దుర్మార్గం
Vemula Prashanth Reddy: ప్రధాని మోడీ అబద్ధాల కోరు
Vemula Prashanth Reddy: మోడీ అబద్ధాల కోరు అంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌పై మోడీ నిరాధార ఆరోపణలు చేయడం దుర్మార్గమని, ప్రధాని స్థాయి వ్యక్తి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు మాట్లాడడం హేయమన్నారు. కేసీఆర్ ఎన్డీయేలో కలుస్తానని చెప్పడం అబద్ధమని.. ఎన్డీయేలో కలవమని బతిమిలాడితే దేశాన్ని అమ్మేవారితో కలమని కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారన్నారు.
ఎన్నికల వేళ అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రధాని.. దర్యాప్తు సంస్థలన్నీ జేబులోనే ఉన్నాయి కదా..? ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలంటే మీ సహాయం ఎందుకు అని ప్రశ్నించారు. వంద మంది ఎమ్మెల్యేల బలం ఉందని.. మోడీ బలం ఎంత అంటూ నిలదీశారు. కేసీఆర్‌కు ఉన్న బలంతో కేటీఆర్‌ను సీఎం చేయొచ్చని.. మోడీ బోడి సహాయం ఎవడికి కావాలంటూ విమర్శించారు.