Bhadrachalam Temple: భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
Bhadrachalam Temple: కరోనా ఆంక్షల కారణంగా తిరువీధి సేవలు, ఊరేగింపులు రద్దు
భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
Bhadrachalam Temple: దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు నేపథ్యంలో ఈనెల 13 వరకు జరిగే నిత్యకళ్యాణాలు రద్దు చేశారు. అదే విధంగా కరోనా ఆంక్షల కారణంగా తిరువీధి సేవలు, ఊరేగింపులు రద్దు చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగానే భక్తులకు స్వామివారి దర్శన ఏర్పాటు చేస్తున్నారు.