Uttam Kumar Reddy: ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

Uttam Kumar Reddy: మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Update: 2023-12-05 06:13 GMT

Uttam Kumar Reddy: ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

Uttam Kumar Reddy: మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో ఆయన నేడు ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలువనున్నారు. ఈ సందర్భంగా తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు అందజేస్తారు.

నవంబర్‌ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. మరో వైపు కాంగ్రెస్ నుండి సీఎం రేసులో ఉన్న ఆయన ఇవాళ సడెన్‌గా ఢిల్లీ వెళ్లడం పొలిటికల్ సర్కిల్స్ హాట్ టాపిక్‌గా మారింది. ఇక, తెలంగాణ నెక్ట్స్ సీఎం ఎవరని అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. ఈ రోజు సాయంత్రం సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తామని ఖర్గే స్పష్టం చేశారు. దీంతో ఇవాళ సాయంత్రం సస్పెన్స్‌ వీడనుంది.

Tags:    

Similar News