Upasana: ఉపాసనకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వుల మేరకు ఆమెను తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్గా నియమించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌కు ఉపాసన సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్‌గా ఉన్న ఉపాసన ఇప్పటికే ఆరోగ్యవిషయక అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణను క్రీడల రంగంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కూడా తీసుకున్నారు. ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీ కింద ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ హబ్‌కు సంజీవ్ గోయెంకాను చైర్మన్‌గా, ఉపాసనను కో-ఛైర్మన్గా నియమించారు.
ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ – “ఇది నాకు చాలా గౌరవంగా భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సంజీవ్ గోయెంకాతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది” అంటూ తెలిపింది. త్వరలోనే ఆమె కొత్త బాధ్యతలను అధికారికంగా స్వీకరించే అవకాశం ఉంది.
సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఉపాసన తన అవగాహన వీడియోలతో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. లక్షల్లో ఫాలోవర్లతో ఆమె సోషల్ మీడియా ప్రభావం కూడ విస్తృతంగా ఉంది.