కేటీఆర్‌ను కలిసి మద్దతు తెలిపిన యునైటెడ్ ముస్లిం ఫోరం

BRS: బీఆర్ఎస్‌కు మద్దతు తెలిపిన యునైటెడ్ ముస్లిం ఫోరం

Update: 2023-11-04 07:22 GMT

కేటీఆర్‌ను కలిసి మద్దతు తెలిపిన యునైటెడ్ ముస్లిం ఫోరం

BRS: మైనార్టీల సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని యునైటెడ్ ముస్లిం ఫోరం తెలియజేసింది. హైదరాబాద్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమ పూర్తి మద్దతును ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనార్టీల స్థితిగతుల్లో గుణాత్మకమైన మార్పు వచ్చిందన్నారు. ముఖ్యంగా మైనార్టీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గురుకులాల వలన అద్భుతమైన భవిష్యత్తు కలిగిన మైనార్టీ పౌరులు తయారవుతున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Tags:    

Similar News