Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Kishan Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఆర్దిక పరిస్థితికి సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని లేఖలో తెలిపారు.
Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Kishan Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఆర్దిక పరిస్థితికి సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని లేఖలో తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టారని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదంటూ హామీల అమలు నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. మరో వైపు కేంద్రం తెలంగాణ అభివృద్ధికి 12 లక్షల కోట్ల మేర నిధులు కేటాయించిందని కిషన్ రెడ్డి వివరించారు.
ఇవి కాకుండా కేంద్ర ఆర్ధిక సంస్థల ద్వారా మరో పది లక్షల కోట్ల రుణాలు అందించారని కిషన్ రెడ్డి చెప్పారు. స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పథకం కింద వడ్డీ రహిత రుణాలుగా పది వేల కోట్లకు పైగా కేంద్రం ఇచ్చిన మూల ధన ప్రాజెక్టులకు సహకరించాలని కేంద్ర మంత్రి వివరించారు. 2014లో మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రానికి గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు పట్టిన దుస్థితి నేటి రాష్ర్ట ఆర్ధిక పరిస్థితికి అద్దం పడుతుందని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగా రాష్ర్ట ఆర్దిక పరిస్థితిపై పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖలో స్పష్టం చేశారు.